మౌన వీణా గానం
మౌన వీణాలాపన
కనిపించని దూరంలో
చంద్రుడిని చూసి
పరవశించి పోతు నువ్వు
వర్శించిన మేఘంలో
వెన్నెలని వెతుకుతూ నేను
ఎన్నో జన్మల బంధాన్ని తలపిస్తూ
మన గమనాల చుట్టూ
మనమే భ్రమిస్తూ
మౌన వీణా లాపన లో
ప్రేమ గాన మధురిమలు
ఆస్వాదిస్తూ
కలత నిదురలో
మెలుకువ కౌగిలిలో
ప్రతి సమయం
అతి మధురం
అణువణువు
ఒక ప్రణయ మధువు
సరస సరాగా ల
సుమధనువు.
🌷 ఝాన్సీ🦜
Comments
Post a Comment