నా అంతరంగం

 భగవంతుడు మానవుడు తన అపూర్వ కల్పనలో సృజించిన 

మహోన్నత శిఖ ర సమాన విరాట్ స్వరూపం .తన కళ్ళెదుట తనే తనకంటే ఎత్తులో నిర్మించుకుని ప్రేమతో ఆరాధనతో పవిత్రమూర్తిగా కొలిచే దైవం. మానవుడిలో ఈ నైజం నాగరికత తొలినాళ్ళ నుంచి ఉంది. ఆది మానవుడు మొదటి సారి సూర్యుడిని చూసినప్పుడు సూర్యదేవుని గా వర్షాన్ని చూసినప్పుడు వరుణ దేవుడిగా ,అగ్ని నీ కనుగొన్నప్పుడు అగ్నిదేవుడు గా భావించి ఒక పవిత్ర భావంతో పూజించడం మొదలు పెట్టాడు. సృష్టిలో శక్తులను తనకంటే అతీతమైన శక్తిగా భావించి పూజించడం మన మతంగా సంస్కృతిగా మారింది. నిజానికి మనిషి ఊహా శక్తి నుంచి ఆవిర్భవించిన ఒక మహోన్నత రూపాన్ని తనకంటే అధికుడిగా శక్తిమంతుడు గా తలుచుకుంటూ దానిద్వారా స్ఫూర్తిని చైతన్యాన్ని తిరిగి గ్రహించడం జరుగుతోంది. మనం కళ్ళముందు చూస్తున్న శాస్త్ర విజ్ఞాన పురోగతి క్రమం కూడా ఇంతే కదా. ప్రకృతిలో మనకు కనిపించే ప్రతీ చర్యకు శాస్త్రీయమైన కార్యకారణ సంబంధాన్ని అన్వేషిస్తూ వాటిని గణిత శాస్త్ర సూత్రాల ద్వారా నిరూపించే ప్రామాణిక సిద్ధాంతాలను రూపొందిం చూ కుంటున్నాం.. ఈ ప్రక్రియలో మన హిందూమతం ప్రాతిపదిక .ప్రతిచోట దర్శనమిస్తుంది. మన మతం గురించి అన్యదేశ స్తులు గుర్తు చేసే దుర్దశనుంచి విముక్తి పొంది మనలో మనకు తెలియని చైతన్య శక్తిని మనమే హనుమంతుడి లా ఆకాశమంత ఎత్తుకి పెంచుకుని   మన మతాన్ని అస్తిత్వాన్ని కాపాడుకుందాం.

Comments

Popular posts from this blog

చలం ప్రేమలేఖలు

మౌన వీణా గానం