Posts

మౌన వీణా గానం

 మౌన  వీణాలాపన                                              కనిపించని దూరంలో చంద్రుడిని చూసి పరవశించి పోతు నువ్వు వర్శించిన మేఘంలో వెన్నెలని వెతుకుతూ నేను  ఎన్నో జన్మల బంధాన్ని తలపిస్తూ మన గమనాల చుట్టూ మనమే భ్రమిస్తూ మౌన వీణా లాపన లో ప్రేమ గాన మధురిమలు ఆస్వాదిస్తూ కలత నిదురలో మెలుకువ కౌగిలిలో ప్రతి సమయం అతి మధురం  అణువణువు ఒక ప్రణయ మధువు సరస సరాగా ల సుమధనువు.                            🌷 ఝాన్సీ🦜

చలం ప్రేమలేఖలు

 "ఈ ప్రపంచం ఈ సృష్టి సౌందర్యమయం ఒక ప్రేమ లేఖ." మనసున్న వారికి వారి మనసెరిగిన వారికి ఎంతో మనోహరంగా స్పృశిస్తూ0ది ఈ వాక్యం. ఎంత లోతైన నిర్వచనం......  అసలు మనసు పొరలలో ని అతి సున్నితత్వ భావాన్ని తట్టిలేపి దాని చేత తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పించ గలగడం ఎవరికీ అంత సులువు కాదు. జీవితంలో చాలామంది పొందలేకపోయిన మానసిక ప్రశాంతతను కలిగి స్తూ, మనో మందిరాన్ని వెలిగించి మానస వీణ ను మ్రోగించిన ప్రేమ అనుభూతిని గుర్తు చేస్తాయి చలం " ప్రేమ లేఖలు". తెలుగు వారి జీవితంలో ఉత్తరాలు రాసుకునే సంప్రదాయం అంతర్భాగమై ఉంది. మనసులో ముద్రించుకున్న మనిషి కోసం ఏ విధంగా ఎదురుచూస్తామో ఆ మనిషి రాసే ఉత్తరాల కోసం కూడా అలాగే ఎదురు చూడటం ఓ చిత్రమైన మధురమైన అనుభూతి. సోషల్ మీడియా హవా నడుస్తూ, mails,  మెసేజెస్, తలచుకోగానే మాట్లాడుకునే అవకాశం ఇచ్చే స్మార్ట్ ఫోన్లు ఉండడంవల్ల ఈరోజుల్లో ఉత్తరాలు రాసుకునే అలవాటు అవసరం కనుమరుగైపోయింది. కానీ నీ మనుషులు మాటలు గాలిలో కలిసి పోతాయి.  వాళ్ళు రాసిన మాటలు మాత్రం నాలుగు కాలాలు నిలిచిపోతాయి. రానురాను మధురానుభూతులతో వెలిగి పోతాయి. మనసుల భావోద్వేగాల తాలూకు స్మృతులు గా మ...

నా అంతరంగం

 భగవంతుడు మానవుడు తన అపూర్వ కల్పనలో సృజించిన  మహోన్నత శిఖ ర సమాన విరాట్ స్వరూపం .తన కళ్ళెదుట తనే తనకంటే ఎత్తులో నిర్మించుకుని ప్రేమతో ఆరాధనతో పవిత్రమూర్తిగా కొలిచే దైవం. మానవుడిలో ఈ నైజం నాగరికత తొలినాళ్ళ నుంచి ఉంది. ఆది మానవుడు మొదటి సారి సూర్యుడిని చూసినప్పుడు సూర్యదేవుని గా వర్షాన్ని చూసినప్పుడు వరుణ దేవుడిగా ,అగ్ని నీ కనుగొన్నప్పుడు అగ్నిదేవుడు గా భావించి ఒక పవిత్ర భావంతో పూజించడం మొదలు పెట్టాడు. సృష్టిలో శక్తులను తనకంటే అతీతమైన శక్తిగా భావించి పూజించడం మన మతంగా సంస్కృతిగా మారింది. నిజానికి మనిషి ఊహా శక్తి నుంచి ఆవిర్భవించిన ఒక మహోన్నత రూపాన్ని తనకంటే అధికుడిగా శక్తిమంతుడు గా తలుచుకుంటూ దానిద్వారా స్ఫూర్తిని చైతన్యాన్ని తిరిగి గ్రహించడం జరుగుతోంది. మనం కళ్ళముందు చూస్తున్న శాస్త్ర విజ్ఞాన పురోగతి క్రమం కూడా ఇంతే కదా. ప్రకృతిలో మనకు కనిపించే ప్రతీ చర్యకు శాస్త్రీయమైన కార్యకారణ సంబంధాన్ని అన్వేషిస్తూ వాటిని గణిత శాస్త్ర సూత్రాల ద్వారా నిరూపించే ప్రామాణిక సిద్ధాంతాలను రూపొందిం చూ కుంటున్నాం.. ఈ ప్రక్రియలో మన హిందూమతం ప్రాతిపదిక .ప్రతిచోట దర్శనమిస్తుంది. మన మతం గురించి అన్యదేశ ...